త్యక్త్వా  కర్మఫలాసంగం
నిత్యతృప్తో   నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృత్తోపి   నైవ
కించిత్   కరోతి  సః ||

తా|| సమస్తకర్మలయందును వాటి ఫలితములయందును సర్వథా ఆసక్తిని వీడి, సంసార - ఆశ్రయరహితుడై, పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు, కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికిని వాస్తవముగా వాటికి (కర్మలకు) కర్త కాడు.

****************************************************************************************

అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః |
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ||

తా: పార్థా! నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి, పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు, సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా సహజముగనే నేను లభింతును.

****************************************************************************************

ఆబ్రహ్మభువనాల్లోకాః
పునరావర్తినో ర్జున |
మాముపేత్య తు కౌంతేయ
పునర్జన్మ న విద్యతే ||

తా:   అర్జునా! బ్రహ్మలోకపర్యంతము ఉన్న సమస్తలోకములును పునరావృత్తములు. కౌంతేయా! ( లోకములన్నియును కాలమునకు పరిమితమైనవి. కాని నేను కాలాతీతుడను) కనుక నన్ను చేరినవారికి పునర్జన్మ యుండదు.

****************************************************************************************