యథా సర్వగతం సౌక్ష్మ్యా
దాకాశం నోపలిప్యతే,
సర్వత్రావస్థితో దేహే
తథాత్మానోపలిప్యతే.

సర్వత్ర వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుటవలన ఏ ప్రకారముగ (ధూళి మున్నగువానిచే) అంటబడదో, ఆ ప్రకారమే శరీరమంతటను (లేక సకలశరీరములందును) వెలయుచున్న పరమాత్మ (శరీర గుణదోషములచే) అంటబడకయున్నాడు.

****************************************************************************************

యథా ప్రకాశయత్యేకః
కృత్స్నం లోకమిమం రవిః,
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం
ప్రకాశయతి భారత.

ఓ అర్జునా! సూర్యుడొక్కడే ఈ సమస్తలోకమును ఎట్లు ప్రకాశింపజేయుచున్నాడో, అట్లే క్షేత్రజ్ఞుడను పరమాత్మ ఈ సమస్తక్షేత్రమును ప్రకాశింప జేయుచున్నాడు.

****************************************************************************************

క్షే్త్రక్షేత్రజ్ఞ యోరేవ
మంతరం జ్ఞానచక్షుషా,
భూతప్రకృతిమోక్షం చ
యే విదుర్యాంతి తే పరమ్‌.

ఎవరు జ్ఞానదృష్టిచేత ఈ ప్రకారముగ క్షేత్రక్షేత్రజ్ఞులయొక్క భేదమును భూతములకు సంబంధించియుండు (లేక, కారణమైన) ప్రకృతి (అవిద్య) నుండి విముక్తినికలుగజేయు ఉపాయమును తెలిసికొందురో వారు పరమాత్మపదమును (మోక్షమును) బొందుదురు.

****************************************************************************************